ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి పూర్తి సమాచారం
AP లో 2024 ఎన్నికల్లో గెలుపొందిన తెలుగుదేశం, జనసేనా, భారతీయ జనతా పార్టీల కూటమి గణ విజయం సాధించింది. తత్ఫలితంగా AP లో నూతన ప్రభుత్వం ఏర్పడింది N. చంద్ర బాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, k. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది, రాష్ట్రంలో గల వివిద శాఖలలో మంత్రులను కేటాయిస్తూ మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ అంశాలపై రానున్న వివిద రకాల పోటీ పరీక్షల్లో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది కావున ఈ అంశాలపై అవగాహన ఏర్పరచుకొవడం అవసరం. AP DSC, SI, CONSTABLE, OTHER POLICE CATEGORIES, APPSC, లాంటి ఇతర పోటి పరీక్షలకు ఉపయోగ విధంగా ఈ అంశాలు తెలియచేయటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ వివరాలు ఇలా ఉన్నాయి
1. నారా చంద్రబాబు నాయుడు (ముఖ్యమంత్రి ) :
GAD, లా & ఆర్డర్, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ & అన్ని ఇతర పోర్ట్‌ఫోలియోలు మంత్రులకు కేటాయించబడలేదు
2. కొణిదల పవన్ కళ్యాణ్ (ఉప ముఖ్యమంత్రి ) :
పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ది & గ్రామీణ నీటి సరఫరా; పర్యావరణం, అటవీ , సైన్స్ & టెక్నాలజీ
3. నారా లోకేష్ :
మానవ వనరుల అభివృద్ధి; IT ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్; RTG
4. కింజరాపు అచ్చన్నాయుడు :
వ్యవసాయం; సహకారం, మార్కెటింగ్, పశు సంవర్ధక, డెయిరీ డెవలప్‌మెంట్ & ఫిషరీస్
5. కొల్లు రవీంద్ర : మైన్స్ & జియాలజీ; ఎక్సైజ్
6. నాదెండ్ల మనోహర్ : ఆహారం మరియు పౌర సరఫరాలు; వినియోగదారుల వ్యవహారాలు
7. పొంగూరు నారాయణ : మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్
8. అనిత వంగలపూడి : హోం వ్యవహారాలు & విపత్తు నిర్వహణ
9. సత్య కుమార్ యాదవ్ : ఆరోగ్యం; కుటుంబ సంక్షేమం & వైద్య విద్య
10. డాక్టర్ నిమ్మల రామానాయుడు : జలవనరుల అభివృద్ధి
11. ఆనం రాంనారాయణ రెడ్డి : ఎండోమెంట్స్
12. నస్యం మహమ్మద్ ఫరూక్ : చట్టం & న్యాయం; మైనారిటీ సంక్షేమం
13. గుమ్మడి సంధ్యా రాణి : స్త్రీలు & శిశు సంక్షేమం; గిరిజన సంక్షేమం
14. పయ్యావుల కేశవ్ : ఆర్థిక; ప్రణాళిక; వాణిజ్య పన్నులు & శాసనసభ
15. అనగాని సత్య ప్రసాద్ : రాబడి, రిజిస్ట్రేషన్ & స్టాంపులు
16. కొలుసు పార్థసారథి : హౌసింగ్, I&PR
17. డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి :
సాంఘిక సంక్షేమం; వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్ సంక్షేమం; సచివాలయం & గ్రామ వాలంటీర్
18. గొట్టిపాటి రవి కుమార్ : శక్తి
19. కందుల దుర్గేష్ : పర్యాటకం, సంస్కృతి & సినిమాటోగ్రఫీ
20. బీసీ జనార్దన్ రెడ్డి : రోడ్లు & భవనాలు; మౌలిక సదుపాయాలు & పెట్టుబడులు
21. TG భరత్ : పరిశ్రమలు & వాణిజ్యం; ఆహార ప్రాసెసింగ్
22. S. సవిత : బీసీ సంక్షేమం; ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం; చేనేత & వస్త్రాలు
23. వాసంశెట్టి సుభాష్ : లేబర్, ఫ్యాక్టరీలు, బాయిలర్స్ & ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్
24. కొండపల్లి శ్రీనివాస్ : MSME; SERP; NRI సాధికారత & సంబంధాలు
25. మందపల్లి రాంప్రసాద్ రెడ్డి : రవాణా; యువత & క్రీడలు
పైన పేర్కొన్న అంశాల మాదిరి ఎలాంటి అంశాల గురించి పూర్తి సమాచారం కావాలని కోరుకుంటున్నారు Comment రూపంలో తెలియజేయండి. మరింత సమాచారం కోసం మన Blog ను follow చేయండి
Post a Comment
0Comments