ఆంధ్రప్రదేశ్ లో త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా రేషన్ కార్డులు పొందాలని అనుకునే వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది త్వరలో రేషన్ కార్డుల జారీ చేపడతామని ఇటీవల ఓ ప్రకటనలో తెలియజేసింది.
గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి దీటుగా రాష్ట్ర ప్రభుత్వం రైస్ కార్డు విదానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే ఈ విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా అనే విషయం పై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. గత ప్రభుత్వ రైస్ కార్డు జారీ విధానంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి అని రైస్ కార్డు పొందాలి అంటే చాలా కష్టం లేదా ఎక్కువ ప్రాసెస్ ఉంది అని దానిని సారించాలని ప్రభుత్వం తెలియజేసింది.
గతంలో 300 యూనిట్లు విద్యుత్ వినియోగం చేసిన వారని అనర్హులుగా వ్యవహరించారు ఈ విషయంపై ప్రస్తుత ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ అంశాన్ని సడలింపుకు అవకాశం ఉంది. గతంలో కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా, టాక్స్ చెల్లించే వారు ఉన్నా, ఫోర్ వీలర్ ఉన్నా మరియు ఇతర కారణాల వల్ల అనర్హులుగా గుర్తించి వారికి రేషన్ కార్డులు నిలిపి వేయడం జరిగింది. కానీ అదే కుటుంబంలో ఉండి కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి కొత్త రేషన్ కార్డులు జారీ చేసే విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త రేషన్ కార్డుల జారీ మరింత సులభం చేసే విధంగా కూటమి ప్రభుత్వం ఆదేశాలు త్వరలో విడుదల చేయనుంది.
కొత్త రేషన్ కార్డుకు అర్హతలు మరియు అనర్హతలు :
- ఆంధ్రప్రదేశ్ లో శాశ్వత నివాసులు అయి ఉండాలి ఒకే ప్రాంతంలో కనీసం ఆరు నెలల కంటే ఎక్కువ సమయం నివాసం ఉండి ఉండాలి.
- పట్టణ ప్రాంతాల్లో వారు వెయ్యి చదరపు గజాలు మించి నివాస స్థలం ఉండకూడదు.
- టాక్స్ చెల్లించే వారు, ప్రభుత్వ ఉద్యోగులు, నాలుగు చక్రాల వాహనాలు గల వారు (ట్రాక్టర్, టాక్సీ వంటివి మినహా).
- 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగం ఉన్న వారు అనర్హులు (ఈ అంశంపై త్వరలో స్పష్టత ఇవ్వనున్నారు).
- వ్యవసాయ భూమి మెట్ట అయితే 10 ఎకరాల లోపు, మాగాణి అయితే 3 ఎకరాల లోపు ఉండాలి. రెండు కలిపి అయితే మొత్తంగా 10 ఎకరాలలోపు ఉండాలి అంటే మాగాణి 2 + మెట్ట 8 ఉండవచ్చు.
Note ::
- ఇతర అంశాలపై ప్రభుత్వం త్వరలో పూర్తి కార్యాచరణ విడుదల చేయనుంది.
కావలసిన ద్రువీకరణ పత్రాలు ::
- వివాహ ధృవీకరణ పత్రం తప్పని సరిగా ఉండాలి
- కుటుంబ సభ్యుల అందరి ఆధార్ కార్డుల జిరాక్స్లు
- తల్లితండ్రుల రేషన్ కార్డుల జిరాక్స్లు
- ఆధార్కు ఫోన్ నెంబర్ లింకు చేసి ఉండాలి
Note ::
- కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు ఇక్కడ కుటుంబం అంటే భార్య, భర్త మరియు పిల్లలు. ఒకవేళ పెళ్లి అయిన వారు వారి తల్లిదండ్రుల కార్డులలొ ఉంటే వారిని ఆ కార్డు నుండి వేరు చేసి కొత్త కార్డు జారీ చేస్తారు.
Post a Comment
0Comments