గణిత భాజనియతా సూత్రాలు మరియు వాటి ఉపయోగం

pedEdu
By -
0

గణిత భాజనియతా సూత్రాలు 

ఒక సంఖ్య మరొక సంఖ్య చే నిశ్శేషంగా భాగించబడుతుందా ? లేదా ? అని పరిశీలించడానికి మనం ఉపయోగించే విధానమునే భాజనీయతా సూత్రం అంటారు. ఈ సూత్రాలు మనకు పరీక్షలో ఇచ్చిన సమస్యలను తేలికగా సాదన చేయడానికి ఉపయోగపడతాయి మరియు పరీక్ష సమయంలో అదిక సమయం వృదా అవ్వకుండా వేగంగా సమాదనం ఇచ్చేందుకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఈ సూత్రాలను ఉపయోగించి అనేక రకాల సమస్యలను ఎక్కువ కాలయాపన చేయకుండా సరైన సమాదనం పొందడానికి వీలుగా ఉంటుంది అనేక రకాల పోటీపరీక్షలలో వీటిని shortcuts లా కూడా ఉపయోగిస్తారు. DSC, TET, APPSC, POLICE వంటి అనేక రకాల పరీక్షలకు ఈ సూత్రాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటిని మనం నిత్యం మన సాదన చేసే అనేక గణిత సమస్యలలో ఉపయోగించినట్లయితే వేగంగా సమాదనం చేయడం అలవాటు అవుతుంది. 



 సంఖ్య   సూత్రం
2 ఒక సంఖ్య ఒకట్ల స్థానంలోని అంకె 0, 2, 4, 6, 8 అయితే ఆ సంఖ్య 2చే నిశ్శేషంగా భాగించబడుతుంది
3 ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 3 చే నిశ్శేషంగా భాగించబడితే ఆ సంఖ్య 3చే నిశ్శేషంగా భాగించబడుతుంది
4 ఒక సంఖ్యలోని చివరి (ఒకట్ల, పదుల స్థానంలోని) రెండు అంకెలతో ఏర్పడిన సంఖ్య 4 చే నిశ్శేషంగా భాగించబడితే ఆ సంఖ్య 4చే నిశ్శేషంగా భాగించబడుతుంది
5 ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో 0 లేదా 5 ఉంటే ఆ సంఖ్య 5చే నిశ్శేషంగా భాగించబడుతుంది
6 ఒక సంఖ్య 2 మరియు 3 లచే భాగించబడితే ఆ సంఖ్య 6చే నిశ్శేషంగా భాగించబడుతుంది
8 ఒక సంఖ్యలోని చివరి (ఒకట్ల, పదుల, వందలు స్థానంలోని) మూడు అంకెలతో ఏర్పడిన సంఖ్య 8 చే నిశ్శేషంగా భాగించబడితే ఆ సంఖ్య 8చే నిశ్శేషంగా భాగించబడుతుంది
9 ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 9 చే నిశ్శేషంగా భాగించబడితే ఆ సంఖ్య 9చే నిశ్శేషంగా భాగించబడుతుంది
10 ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో 0 ఉంటే ఆ సంఖ్య 10చే నిశ్శేషంగా భాగించబడుతుంది
11 ఒక సహజ సంఖ్యలో కుడి నుండి ఎడమవైపుకు పోతూ అంకె వదిలి అంకెల మొత్తాన్ని కనిగొనాలి తర్వాత వదిలివేసిన అంకెల మొత్తాన్ని కనుగొని ఆ రెండు మొత్తాల మద్య భేదం 11 చే నిశ్శేషంగా భాగించబడితే ఆ సంఖ్య 11 చే నిశ్శేషంగా భాగించబడుతుంది


ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంది అని మీరు అనుకుంటే ఇతర విద్యార్థులకు కూడా share చేయండి, ఇలాంటి మరింత సమాచారం కోసం మన site ను రోజు వీక్షించండి.

Post a Comment

0Comments

Post a Comment (0)